అనురాగ్ లో పీ.హెచ్.డి పూర్తి చేసిన జ్యోతి
ఘట్ కేసర్, జూలై 8 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పీ.హెచ్.డి. పరిశోధకురాలు వి. జ్యోతి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ జి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో ఏఐ డ్రైవెన్ ప్రెడిక్టివ్ లో టి సిస్టం ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్ అనే అంశంపై నిర్వహించిన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఈపరిశోధనలో కృత్రిమ మేధస్సు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో పంటల దిగుబడి, నాణ్యత, ఉత్పాదకతను మెరుగుపరచేందుకు వినూత్న అంచనా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.
ఈసందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చనా మంత్రి, సీఈఓ నీలిమ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ముత్తారెడ్డి, పరిశోధన పర్యవేక్షకులు డాక్టర్ జి. విష్ణుమూర్తి జ్యోతిని అభినందించారు. పరిశోధనలో ఆమె చూపిన నిబద్ధత, కృషి, పరిశోధనా దృక్పథాన్ని వారు ప్రశంసించారు.






