మండల జర్నలిస్టుల సంఘం నూతన కమిటీ ఎన్నిక
18-08-2026 12:31 AM
అడ్డాకుల ఆగస్టు 17 : అడ్డాకుల మండల జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐజే యు) నూతన అధ్యక్షుడిగా కే శ్రీనివాస్, ఉ పాధ్యక్షుడిగా శేఖర్ ఎన్నికయ్యారు. సోమవారం సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, కోశాధికారి జిల్లెల రఘు ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా తిరుమలేష్ గౌరవ అధ్యక్షునిగా రవికుమార్ గౌడ్, సంయుక్త కార్యదర్శిలుగా కే యాద య్య సాగర్, ప్రసాద్ కోశాధికారిగా భాస్కరాచారి, కార్యవర్గ సభ్యులు తిరుపతయ్య, ఏం సుందర్, ఏం సాయి రెడ్డి, రాజేష్ ఎం వెంకటేష్, బాబా ఏకగ్రీవంగా నియమితులయ్యా రు. సందర్భంగా నూతన కార్యవర్గానికి సన్మానించి అభినందనలు తెలిపారు






