14 May, 2026 | 2:26 AM

ప్రశాంతంగా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

14-05-2026 12:24 AM

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం: ఎమ్మెల్యే

తాండూరు, మే 13, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా, ప్రశాంతంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు మెజార్టీ గా ఉండడంతో నాలుగు కో ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి..మేన్గారి సుభాష్  2.మహమ్మద్ రహీం 3.చినోళ్ల సరిత  4.ఆప్రిన్ జవేరియా ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లతోపాటు కో ఆప్షన్ సభ్యులు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పార్టీకి  కష్టపడి సేవలు  ఏం చేసినవారికి రానున్న రోజుల్లో పదవులు కట్టబడతామని అన్నారు.