calender_icon.png 9 February, 2026 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రియ శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించండి

09-02-2026 02:19:05 AM

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో పదవ వార్డులో బిజెపి అభ్యర్థి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎల్లంపేటలో సుప్రియ శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టణాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సుప్రియ శ్రీనివాస్ ప్రజల్లో ఉన్నారని, ప్రజాసేవే ముఖ్యంగా భావించి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారన్నారు. సుప్రియ శ్రీనివాస్ కు తాను అండగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధికి కృషి చేస్తా 

వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బిజెపి అభ్యర్థి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కమలం పువ్వు కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.