26 August, 2026 | 2:42 AM

కాంటినెంటల్‌లో ఈహెచ్‌ఎస్ ప్రారంభం

26-08-2026 12:00 AM

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు

హైదరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించే లక్ష్యంతో కాంటినెంటల్ హాస్పిటల్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నూతన ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (ఈహెచ్‌ఎస్)లో అధికారికంగా భాగస్వామ్యం అయింది. ఇకపై అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ ఆసుపత్రిలో క్యాష్‌లెస్ (నగదు రహిత) వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ పథకం ద్వారా లబ్ధిదారులు కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సమగ్రమైన వైద్య మరియు శస్త్రచికిత్స (మెడికల్ అండ్ సర్జికల్ కేర్) సేవలను సులభంగా పొందవచ్చు. ఈ సేవలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సహాయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 104 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఈ నూతన పథకం ప్రారంభం సందర్భంగా కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడానికి, ఆరోగ్యకరమైన, బలమైన రాష్ట్రాన్ని నిర్మించడానికి మా వంతు సహకారాన్ని అందించడంలో కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.