26 August, 2026 | 12:15 AM

హుస్సేన్ నాయక్‌కు ఘన స్వాగతం పలికిన సీతారాం నాయక్

25-08-2026 11:06 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ సీనియర్  నాయకులు భూక్యా సీతారాం నాయక్  నివాసానికి మంగళవారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ విచ్చేశారు. ఈ సందర్భంగా బంజారా మాజీ సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ ఆధ్వర్యంలో హుస్సేన్ నాయక్ గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీతారాం నాయక్  వ్యక్తిగత కార్యాలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్  మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే గతం లో బంజారా సర్పంచ్‌గా విజయం సాధించిన భూక్యా దివ్యశ్రీని అభినందించారు. భవిష్యత్‌లో ఆమె మంచి ప్రజాప్రతినిధిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం బీజేపీ నాయకులతో ఆయన సమావేశమై గిరిజనుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, బిజ్జం శ్రీనివాస రెడ్డి, బీరకా సాయి, రహీమ్, వెంకన్న, హరిచంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.