5 June, 2026 | 2:31 AM

మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి కృషి

04-06-2026 05:36 PM

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి సర్వత్రా కృషి చేస్తానని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. గురువారం ఆమె మున్సిపల్ లోని తొమ్మిదవ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాలనీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య ,తాగునీటి, విద్యుత్ దీపాల పైన కాలనీవాసులతో అవగాహన సభలో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధిర సత్యనారాయణ, మెప్మా ,అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.