నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి
ఎమ్మెల్యే జీఎంఆర్
అమీన్‌పూర్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రూ.8.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నూతన కాలనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, డి ఈ వెంకటరమణ, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ కృష్ణ, మల్లేష్, గోపాల్, బాశెట్టి కృష్ణ, తులసి రెడ్డి, జగదీష్, దాసు, మల్లేష్, శ్రీనివాసరెడ్డి, సునీత, శ్రీకాంత్, గోవింద్, జ్ఞానేశ్వర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






