21 April, 2026 | 5:51 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0

25-02-2026 12:10 AM
  1. తెలంగాణ సమగ్రాభివద్ధికే ‘క్యూర్-ప్యూర్-- రేర్’ 
  2. గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలి చేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు.

మంగళ వారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యా ప్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మా ట్లాడుతూ.. గ్రోత్ అంటే యాదృచ్ఛికంగా వచ్చేది కాదని, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని ముందుకుపోవాలని పేర్కొన్నా రు.

ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విజన్ 2047’ను రూపొందించిందని వెల్లడించారు. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు, రాష్ట్ర సమగ్రాభివద్ధికి ‘క్యూర్-- ప్యూర్ -రేర్’ అనే త్రిముఖ వ్యూహానికి శ్రీకా రం చుట్టి అమలు చేస్తున్నామని వివరించారు. నగరం నుంచి గ్రామం వరకు ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు.

ఏఐ, ఇండస్ట్రీ 5.0 లాంటి టెక్నాలజీస్‌తో వర్క్ కల్చర్‌లో మార్పు వచ్చిందని, రాబోయే రోజుల్లో కంపెనీల కంటే ‘ఎకో సిస్టం’కే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అందుకే భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానినే నిర్మించాలనే దృఢ సంకల్పం తో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

పరిశ్రమలకు కేవలం అనుమతులు ఇచ్చే వ్య వస్థలా కాకుండా, వారితో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు రాంచందర్ రావు, ప్రముఖ వైద్యులు నాగేశ్వర్‌రెడ్డి, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ ఆర్ రవికుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ పాల్గొన్నారు.