calender_icon.png 9 February, 2026 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీక్ టైంలో.. మనీ కొరత

09-02-2026 12:00:00 AM

అరె తమ్మి... నా వద్ద ఉన్న నగదు మొత్తం అయిపోయింది రా.. బ్యాంకులో వెళితే లక్ష రూపాయలు మించి ఇవ్వడం లేదు. ప్రతిరోజు పంచుడికి లక్ష రూపాయలు అయిపోతుంది మిగతా ఖర్చులకు చేతిలో నగదు లేక ఇబ్బం ది పడుతున్న.. ఎక్కడైనా నగదు ఉంటే ఇప్పిం చు రా.. కమిషన్ నూటికి ఏదైనా పర్వాలేదు అంటూ నిర్మల్ జిల్లాలో పార్టీల అభ్యర్థులు నగదు కోసం పడరాని పాటుపడుతున్నారు.

నిర్మల్ జిల్లాలోని నిర్మల్  ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం గడువు ఉండడం ఈనెల 11న ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినందుకు నగదు తప్పనిసరి అయింది. 

  1. నగదు కొరతతో నానా తంటాలు
  2. బ్యాంకుల్లో నగదు డ్రాపై ఆంక్షలు 
  3. పెరిగిన ఎన్నికల నిర్వహణ ఖర్చులు
  4. కమీషన్ ఇస్తామన్న దొరకని నగదు 

నిర్మల్, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి):  మున్సిపల్ ఎన్నికల్లో హడావుడిగా ప్రకటించి ఈనెల 11న ఎన్నికల పోలింగ్ ప్రకటించిన నేపథ్యంలో పోటీ చేసే ఆశావాదులు నగదు సర్దుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఒక్కొక్క వార్డులో నలుగురి నుంచి ఐదుగురు పోటీ పడుతుండగా ప్రతిరోజు ఎన్నికల ప్రచారానికి జనం ఉపయోగించుకుంటున్నా రు. ప్రచార రన్‌లో పాల్గొన్న వారికి రూ.300 చెల్లిస్తున్నారు మగవారికి మద్యం ఇతర ప్రలోభాలు గురిచేస్తున్నారు.

దీనికి తోడు పెగ్జీలు కరపత్రాలు ఇతర ప్రచార సామాగ్రి కోసం తప్పనిసరిగా నగదు తప్పనిసరి అయ్యింది. డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే దానికి సం బంధించిన లెక్కలు బయటపడే అవకాశం ఉండడంతో అభ్యర్థులు నగదును పోగుచేసి వాటి నుంచి ఖర్చులు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నగదు నిల్వలు లేకపోవడంతో నగ దు దొరకక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా రు.

బ్యాంకుల్లో కూడా రోజుకు లక్ష రూపాయల నుంచి నగదు దొరకడం లేదని కొన్ని బ్యాంకుల్లో నగదు లేదని చెప్పడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఆయా వార్డులో ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చు చేసిన అభ్యర్థులు చివరి విషయంలో ఓట్ల పంపకానికి తప్పనిసరిగా నగదు అవసరమని భావిస్తున్నారు.

ప్రతి ఓటర్కు డిజిటల్ చెల్లింపులు సాధ్యం కాదని నగదు ఇస్తేనే ఓటరుకు తృప్తి ఉంటుందన్న భావనతో ఎక్కడి నుండైనా డబ్బులు సర్దుబాటు చేయాలన్న లక్ష్యంతో వడ్డీ వ్యాపారస్తుల వద్ద పెద్ద పెద్ద సైట్లను సంప్రదించి కమిషన్ పద్ధతిలో నగదు తీసుకెళుతున్నారు. నూటికి రెండు రూపాయలు కటింగ్‌తో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ప్రతి ఒక్కరికి డిజిటల్ ఖాతాలు ఉండడంతో నగదు చెలామని కాకపోవడంతో ఎన్నికల్లో నగదు ప్రభావం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉం డడంతో అభ్యర్థులు నగదు కోసం పక్క మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుం ది. ఎన్నికల పుణ్యమాని పట్టణంలో నగదు లావాదేవీలు కూడా పూర్తిగా స్తంభించిపోయినట్టు వ్యాపారులు చెప్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులు నగదు కోసం పడరాని పట్ల పడుతున్నారు.