19 May, 2026 | 3:21 PM

యువకుడి వైద్య ఖర్చులకి దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవతి సమితి ఆర్థిక సాయం

19-05-2026 01:53 PM

సిరిసిల్ల, మే 19 ( విజయక్రాంతి ): గంబీరావు పేట మండలం నర్మాల గ్రామానికి చెందిన కోన సురేష్ బ్రతుకు దెరువు కోసం దుబాయి వెళ్ళాడు. గత నెల తన సోదరి పెళ్ళి నిశ్చయమావగ ఇండియా వచ్చిన సురేష్ అనుకోకుండా రోడ్ ప్రమాదంలో గాయపడ్డాడు. వారిది నిరుపేద కుటుంబం అవడంతో విషయం తెలుసుకున్న దుబాయ్ శ్రీనన్న సేవాసమితి ఉపధ్యక్షుడు బాలు బొమ్మిడి లు శ్రీనన్నాను సంప్రదించిగ ఆర్థిక సాయం కోరగా స్పదించిన అధ్యక్షులు సేవాసమితి సభ్యులు అందరూ కలిసి తమ వంతుగా 18000రూపాయల ఆర్థిక సాయన్ని కోన సురేస్ కు అందించారు. ఈసందర్బంగా సురేష్ మాట్లాడుతూ నాకు ఆర్థిక సాయం చేసిన సేవాసమితికి సభ్యులుకు  ధన్యవాదాలు తెలిపాడు. ఈ  ఆర్థిక సహాయం కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి,బొప్పాపూర్ మాజీ సర్పంచ్ బిమేష్,కూరాకుల రాజు,పంపరి సురేష్,మరియు మాదా జనర్దన్ లు పాల్గొన్నారు.