19 May, 2026 | 3:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: మహిళ మృతి

19-05-2026 01:54 PM

కల్వకుర్తి మే 19 : శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో జయమ్మ (35) అనే మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లికి చెందిన జనార్ధన్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం కోనేటిపురంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరాడు.

మార్గమధ్యలో వెల్దండ , వెళ్లండ మండలం కొట్రా శివారులో హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, జనార్ధన్‌కు గాయాలయ్యాయి. పిల్లలకు స్వల్ప  గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ జనార్ధన్ నిద్రలోకి వెళ్లడంతోనే ప్రమాద చోటు చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు.