18 March, 2026 | 9:32 PM

కాంగ్రెస్ పార్టీ కుట్రతోనే రోహిత్ రెడ్డిపై డ్రగ్స్ కేసు

18-03-2026 06:27 PM

పథకం ప్రకారమే కేసులో ఇరికించారు

కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే ప్రభుత్వ భూముల కబ్జా

బీఆర్ఎస్ నేతలు

తాండూరు,(విజయక్రాంతి): పక్కా పథకం ప్రకారమే తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై డ్రగ్స్ కేసు బనాయించారని అతడిని కేసుల్లో ఇరికించి ఇబ్బందులు సృష్టించేందుకే స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుట్రలు చేశారని తాండూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, పట్లోళ్ల నరసింహులు, కోటిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్, శోభారాణి, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ముస్తఫా బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 

గత సర్పంచ్ మరియు మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ దీటైన జవాబు ఇచ్చిందని రాబోవు రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టమవుతుందని పైలెట్ రోహిత్ రెడ్డిని అడ్డు తప్పిస్తే తిరిగి తాండూర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేర్చని భావించి మొయినాబాద్ లోని ఆయన ఫామ్ హౌస్ లో పోలీసుల సహకారంతో అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా కేసులు నమోదు చేశారని విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం సరికాదని తమకు కూడా కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత విషయాలు చాలా తెలుసని మీరు దిగజారినట్టు మేం దిగజారబోమని అన్నారు.

తాండూర్ పట్టణంలో అభివృద్ధి, సంక్షేమం గాలికి వదిలేసి ప్రజలకు కనీసం తాగునీరు అందించే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.  టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి వద్ద ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు పైలెట్ ను తామే గెలిపించామని గొప్పలు చెప్పుకోవడం సరికాదని  అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చెప్పుకుంటున్న ధారాసింగ్ సొంత గ్రామంలో  సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని టిఆర్ఎస్ జండా ఎగరవేశామన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో సొంత తమ్ముడిని కౌన్సిలర్ గా గెలిపించుకోలేని వ్యక్తి ధారాసింగ్ రోహిత్ రెడ్డిని 2018 ఎన్నికల్లో తానే గెలిపించామని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు దర్జాగా కజ్జాలు చేస్తున్న వారిని ఎమ్మెల్యే సహకరిస్తున్నారని ఆరోపించారు . రోహిత్ రెడ్డి పై ఎన్ని కుట్రలు చేసిన డ్రగ్స్ కేసు నుండి కడిగిన ముత్యంల బయటికి వస్తారని. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి టిఆర్ఎస్ జండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ తాజా మాజీ కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొన్నారు.