ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు
18-03-2026 06:22 PM
- మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల: ఉగాది రాకతో వసంతం మొదలై తరువులు కొత్త చిగురులు తొడుగుతాయని, మన జీవితాల్లోనూ కొత్త ఆశలు,మంచి సంకల్పాలు ప్రారంభం కావాలని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. నూతన తెలుగు సంవత్సరం ప్రజల కుటుంబాల్లో ఆర్థిక,ఆరోగ్య,సంతోషాలను నింపాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని సుఖ-దుఃఖాలు సహా వివిధ అనుభవాలను సూచిస్తాయని వాటిని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయన్నారు. పరాభవ అంటే మనలోని అహంకారాన్ని,చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేదన్నారు.తెలుగు ప్రజల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.




