15 June, 2026 | 11:08 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే.. చాలాన్ లే..

24-03-2026 12:36 AM

ట్రాఫిక్ సీఐ కృష్ణ

యాదగిరిగుట్ట, మార్చి 23: యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా యాదగిరిగుట్ట ట్రాఫిక్  పిఎస్ పరిధిలో వంగపల్లి, పెద్ద కందుకూరు, ఆలేరు, మోటకొండూరు  పరిధిలో ఎన్ హెచ్ 163 హైవే ఎక్కే వాహనాలకు స్పెషల్ గా కౌన్సిలింగ్ చేయించి, అవసరమైన వాళ్లకి హెల్మెట్ కొనిపించి, హెల్మెట్ ధరించని వాళ్లకు ఫైన్లు విధించడం జరిగింది.

వరంగల్ హైవే మీద టూ వీలర్స్ వాహనదారులు కచ్చితంగా హెల్మెట్  ధరించాలని లేనియెడల ఇకమీదట కచ్చితంగా  ఫైన్లు విధించడం జరుగుతుందని, స్థానిక యాదగిరిగుట్ట ట్రాఫిక్ సిఐ ఎలగొండ కృష్ణ తెలిపినారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయాల తీవ్రత తగ్గుతుందని హాస్పటల్లో అయ్యే  బిల్లు  కూడా తగ్గుతుందని తెలిపినారు. ఈరోజు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పిఎస్ పరిధిలో 36  హెల్మెట్లు కొనిపించడం,అదేవిధంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు  44 చలానా విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్‌ఐ దేవేందర్, ఆర్‌ఎస్‌ఐ రాజు, కానిస్టేబుళ్లు కోటి సురేష్ నితిన్ సైదులు పాల్గొన్నారు.