సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు
17-04-2026 08:28 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామపంచాయతీ వారు శుక్రవారం బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండల దృశ్య ప్రయాణికుల అవసరాలను గుర్తించి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ యాల బిందుజ పాలకవర్గం సభ్యులు తెలిపారు. సమీప భవిష్యత్తులో బస్టాండ్ నిర్మాణం చేపట్టి ప్రయాణికుల అవసరాలను తీరుస్తామని పాలకవర్గం వారు పేర్కొన్నారు.






