ప్రభుత్వ పాఠశాలలో కంటి వైద్య శిబిరాలు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): నవ,ఎల్. విపిఐ సంయుక్తంగా నిర్వహించుతున్న పాల్వంచ ప్రభుత్యపాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం హర్షదాయకమని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. నవ లిమిటెడ్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ ప్రభుత్య పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య శిబిరాన్ని బుధవారం మండల పరిషత్ హైస్కూల్ ఎర్రగుంటలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీఈవో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలల అభివృద్ధికి మౌలిక సదుపాయలు కల్పించడంలో ' నవ ' లిమిటెడ్ కృషిని కొనియాడారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ యన్ సురేష్ చంద్ర, ఎల్. వి. ప్రసాద్, అడ్మినిస్ట్రేటర్ సి. దేవి చంద్రరావు, సి. ఎస్. ఆర్ మేనేజర్ సి. హెచ్. శ్రీనివాసరావు, పాఠశాల హెచ్. ఎమ్ శ్రీమతి పి సుధారాణి,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






