ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): అరైవ్-అలైవ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా గోపాల్పేట్ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాబట్టి సమయం వృధా చేయకుండా గోల్డెన్ అవర్స్ లోపు బాధితులను ఆస్పత్రికి తరలించవలసిన అవసరాన్ని ప్రజలకు, ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి వివరించడం జరిగిందన్నారు.
అలాగే రాంగ్ వేర్ స్కీమ్ గురించి తెలియజేస్తూ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని గోల్డెన్ అవర్స్ లోపు ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం 25000 నగదు ప్రోత్సాహం అందిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారు సృజన్ కుమార్ పాల్గొని సిఅర్పి మరియు ఫస్ట్ ఎయిడ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.






