8 July, 2026 | 5:02 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •   డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •  

వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు

08-07-2026 04:04 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా  తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి Y.S రాజశేఖర రెడ్డి జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమం, ఆరోగ్యం, విద్య రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాల సాధనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.