8 July, 2026 | 4:59 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •   డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •  

సీఎం రేవంత్ రెడ్డితో గోద్రెజ్ ప్రతినిధులు భేటీ

08-07-2026 03:46 PM

హైదరాబాద్: గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పావిలియన్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు) రాకేష్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్త‌ర‌ణ‌పైన ముఖ్య‌మంత్రికి రాకేష్ స్వామి నివేదిక అంద‌జేశారు. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీలో పలు కీలక అంశాల‌పైన‌ చర్చించారు. 

ఖ‌మ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటువుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, న‌ర్సీరీ, ఆర్ అండ్ డి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖ‌మ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎక‌రాల భూమిని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ‌కు ప్ర‌భుత్వం కేటాయించింది. సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంస్థ‌ కోరినట్లు సమాచారం. ప్రాసెసింగ్ మిల్ కోసం రాహ‌దారిని విస్త‌రించాల‌ని సంస్థ ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రిని కోరాడంతో టీజీఐఐసీ ఆధ్వ‌ర్యంలో రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు.