ఓయూలో బీఆర్ఎస్వీ, విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ
08-07-2026 03:41 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని తక్షణమే అమలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో( Osmania University) బీఆర్ఎస్వీ(BRSV), ఇతర విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ నిర్వహించాయి. 2 లక్షల ఉద్యోగాలు, 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిరుద్యోగ యువతతో కలిసి బీఆర్ఎస్వీ, ఇతర విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.






