రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేలా రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వం పెద్దల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా మునిగేలా రాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేసి రైతాంగానికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.






