8 July, 2026 | 5:02 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •   డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •  

సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష

08-07-2026 04:00 PM

రాష్ట్ర అధ్యక్షుడు సీపీయస్ కృష్ణారావు

నిర్మల్,(విజయక్రాంతి): కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి (సీపీఎస్) పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ త్వరలో హైదరాబాదులో ఆమరణ దీక్షకు కూర్చుంటామని సీపీఎస్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీపీఎస్ కృష్ణారావు పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా సి.పి.ఎస్. రద్దు కోసం పోరాడుతున్నామని, అనేక మైనటువంటి కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీపీఎస్ రద్దు చేస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారని గుర్తు చేశారు. సీపీఎస్ ఉద్యోగులు ముఖ్యమంత్రిపై భారీగా ఆశలు పెట్టుకున్నామని, పాత పెన్షన్ విధానాన్ని త్వరలో తెలంగాణలో అమలు చేస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ ఏరియర్స్ కొన్ని విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తారు.

మిగిలిన బకాయిలను ఈనెల విడుదల చేసే  బిల్లుల్లో పూర్తి మొత్తంలో చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా హైదరాబాదులో ఆమరణ నిరాహార దీక్షతో పాటు..జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం త్వరలోనే సి.పి.యస్ రద్దు కార్యాచరణ ప్రారంభిస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్ని కల మేనిఫెస్టోలో సి.పి.యస్ .రద్దును స్పష్టంగా పేర్కొందని, కానీ కొందరు ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు.