16 May, 2026 | 4:31 PM

Breaking News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా   •   మంథని మున్సిపల్ ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్   •   బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా అడిచెర్ల రాజు   •   సిబ్బంది భద్రతకు మరింత పటిష్ట చర్యలు   •   దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి   •   దోస్త్ రెండో విడుత అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ జయ   •   నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •  

వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ

16-05-2026 03:44 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని సీతాయిపల్లి, మేడిపల్లి గ్రామాల వరి కొనుగోలు కేంద్రాలను డీఆర్‌డీఏ ఏపీడీ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరిలోని తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. తూకాన్ని త్వరితగతంగా చేపట్టాలని , తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు త్వరితగతిన పంపాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం ప్రసన్న కుమార్, సీసీ లు రాములు, రమేష్, కాశీనాథ్ వివోఎ లు పుష్పలత, గౌస్ ఖాన్, ట్యాబ్ ఆపరేటర్ భూమన్న, రైతులు పాల్గొన్నారు.