29 August, 2026 | 1:09 AM

పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్‌రెడ్డి ఆర్థిక సహాయం

29-08-2026 12:00 AM

బాన్సువాడ, ఆగస్టు 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి, చిట్టి మానసలకు బాన్సువాడ పట్టణానికి చెందిన అన్విత హాస్పిటల్ డాక్టర్ సంతోష్ రెడ్డి శుక్రవారం ఆర్థిక సహాయం అందించారు.

హైదరాబాద్లోని దోమలగూడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో UGౄPEౄ రెండేళ్ల కోర్సులో చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చుల కోసం రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. క్రీడారంగంలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు డాక్టర్ సంతోష్ రెడ్డి ముందుకు రావడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ సంతోష్ రెడ్డి కి క్రీడాకారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.