30 May, 2026 | 2:45 AM

గిన్నిస్ రికార్డ్ సాధించిన డాక్టర్ శాంతకుమారి

30-05-2026 12:45 AM

మిర్యాలగూడ, మే 29: నిరవధికంగా కీబోర్డ్ వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ లో స్థానం సంపాదించింది దామరచర్ల మండల కేంద్రానికి చెందిన డాక్టర్ పల్లా శాంతకుమారి. శుక్రవారం హైదరాబాదులోని గచ్చిబౌలిలో విక్టరీ ఆడిటోరియం ప్రాంగణంలో గిన్నిస్ అచీవర్స్ మీట్ లో ఈ అవార్డు ఆమె అందుకున్నారు. గత ఫిబ్రవరి 2న హైదరాబాదులో గిన్నిస్ వరల్ రికారడ్స్ ప్ర తినిధుల ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో ఆగకుండా గంటపాటు కీబోర్డ్ వాయించడంలో పోటీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి 22 దేశాల నుండి 2000 మంది కీబోర్డ్ వాయి ద్య కళాకారులు పాల్గొన్నారు. అందులో 777 మంది విద్యార్థులు ప్రతిభ చూపి ఎం పిక కాగా, వారిలో మొదటి స్థానంలో డాక్టర్ శాంత కుమారి. హల్లేల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు ఆగస్టు దండింగి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గిన్నిస్ రికార్డు సాధించిన డాక్టర్ శాంతా కుమారిని గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు అభినందించారు.