30 May, 2026 | 2:10 AM

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

30-05-2026 12:44 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, మే 29 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్యానాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ‘మెప్మా’ ద్వారా 22 మహిళా స్వయం సహాయక సంఘాలకు 2.20 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కు ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, మహిళల పేరిటే ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు సో లార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించి వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. అనంతరం ఆమనగల్లు పట్టణ అభివృద్ధిపై మా ట్లాడుతూ.. కమలనగర్లోని డంపింగ్ యార్డు ను జంగారెడ్డిపల్లి సమీపంలోని ప్రభుత్వ స్థలానికి తరలిస్తామని హామీ ఇచ్చారు.

అలా గే రూ.10 కోట్లతో వృత్తి నైపుణ్య శిక్షణ కేం ద్రం, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఏసీపీ కా ర్యాలయం, కోర్టు భవనాలు, స్టేడియం ఏ ర్పాటుకు స్థలాలు కేటాయిస్తామన్నారు. అ నంతరం ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి కొత్త డంపింగ్ యార్డు స్థలాన్ని, నిర్మాణంలో ఉ న్న ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’, బాలుర వసతి గృహ పనులను పరిశీలించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఎనమల్ల రమేష్, ఏఎంసీ డైరెక్టర్లు శ్రీశైలం, పాండురంగయ్య, కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్, మండల, పట్టణ అధ్యక్షులు జగన్, మానయ్య, నాయకులు విజయ్ నాయక్ కృష్ణానాయక్, బా బా, ఎంగలి ప్రసాద్, విజయ్, కొండల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.