పారిశుధ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
27-06-2026 08:02 PM
- డీఎల్పీవో సుధీర్
బూర్గంపాడు,(విజయక్రాంతి): పంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీవో సుధీర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ కార్యాలయాన్ని డీఎల్పీవో సుధీర్ ఎంపీవో మద్ది రామకృష్ణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాల అమలుతీరును పరిశీలించారు. పంచాయతీ పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, కార్యదర్శి సరోజ, సిబ్బంది పాల్గొన్నారు.






