ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి
27-06-2026 08:05 PM
- ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు,(విజయక్రాంతి): ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజలకు ఈ సర్వే ప్రక్రియ అందుబాటులో ఉండేలా అధికారులు చూడాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల పరిధిలోని సారపాక సుందరయ్య నగర్ లో జరిగిన సర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్లకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలు తమ ఓటరు వివరాలు పరిశీలిచి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా పేర్కొన్నారు.






