ఓటరు జాబితా ఇంటింటి ధ్రువీకరణ
26-06-2026 12:20 AM
ఘట్ కేసర్, జూన్ 25 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) 2026 కార్యక్రమంలో భాగంగా ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి గురువారం ఘట్ కేసర్ డివిజన్ లో క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహించారు.
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, పర్యవేక్షక అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి డిప్యూటీ కమిషనర్ వాణి ఓటరు జాబితాలను సమీక్షించారు. అలాగే అధికారిక ఎన్నికల సామాగ్రి పంపిణీని పర్యవేక్షించడంతో పాటు, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఇంటింటి ధృవీకరణ డ్రైవ్ల సమయంలో స్థానిక నివాసితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వాణి తో పాటు ఏఎంసీ వెంకటేశం, ఏఎంసీ వేణుగోపాల్, బిఎల్‌ఓ సూపర్వైజర్లు బిఎల్‌ఓ లు పాల్గొన్నారు.






