26 June, 2026 | 1:48 AM

మేడ్చల్‌లో ఇంటింటి సర్వే

26-06-2026 12:27 AM

మేడ్చల్ అర్బన్, జూన్ 25 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ పట్టణంలోని బూత్ నంబర్ 79 ఎన్జీవోస్ కాలనీలో కార్యక్రమం ప్రారంభం అయ్యిందని  మున్సిపల్ మాజి కౌన్సిలర్ నడికొప్పు ఉమ నాగరాజు ముదిరాజ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ  ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా జిహెచ్‌ఎంసి 298 వ డివిజన్ పోలింగ్ బూత్ నంబర్ 79 ఎన్జీవోస్ కాలనీలో ప్రారంభం అయినట్లు ఆమే స్పష్టం చేశారు. ర ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో అందరు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నడికొప్పు నాగరాజు ముదిరాజ్.బి.ఎల్.వో రాజేందర్. తదితరులు పాల్గొన్నారు.