26 June, 2026 | 1:47 AM

సర్ సర్వేను పరిశీలించిన కలెక్టర్

26-06-2026 12:26 AM

మేడ్చల్, జూన్ 25 (విజయక్రాంతి): ఓటర్ల జాబిత ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా గురువారం ప్రారంభించిన బిఎల్‌ఓలు ఇంటింటికి అందిస్తున్న ఎన్యూమ రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని తిమ్మాపూర్, ఎదులాబాదులలో కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకు ఎన్ని ఎన్రోల్ మెం ట్ పత్రాలు ఇచ్చారని, ఒక్కొక్కరికి ఎన్ని ఎ న్రోల్ మెంట్ పత్రాలు ఇస్తున్నారని, ఎన్రోల్ మెంట్ యాప్ ద్వారా ఆప్ లోడ్  చేసే ప్రక్రియను   బిఎల్ ఓ ను అడిగి తెలుసుకున్నా రు. ఒక్కొక్కరికి రెండు పత్రాలు అందజేస్తున్నామని, సెల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ద్వా రా అప్ లోడ్ చేస్తున్నామని  బిఎల్ ఓలు వి వరించారు.ఈ పర్యటనలో  కీసర ఆర్డిఓ వెం కట్ రెడ్డి,  తహాసీల్దారు యాదగిరి రెడ్డి, సం బంధిత అధికారులు పాల్గొన్నారు.