రాజన్న ఆలయ అభివృద్ధికి విరాళం
29-08-2026 05:15 PM
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు భక్తులు విరాళాలు అందిస్తున్నారు. కొత్తపల్లి (హవేలీ) గ్రామానికి చెందిన దూస రిషికేష్ రూ.25 వేల నగదును ఆలయ అభివృద్ధి కోసం విరాళంగా అందజేశారు. స్థానిక ప్రోటోకాల్ కార్యాలయంలో ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మకు నగదును అందజేసి రసీదు పొందారు. ఈ విషయాన్ని ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్ తెలిపారు. భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందించడం పట్ల ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.






