29 August, 2026 | 6:21 PM

సెప్టెంబర్ 1న ఇందిరా పార్క్ వద్ద పీఆర్టీయు ఆధ్వర్యంలో ధర్నా

29-08-2026 05:12 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): పీఆర్టీయు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో  సెప్టెంబర్ ఒకటో తేదీన  హైదరాబాదులోని  ఇందిరా పార్క్ వద్ద  నిర్వహించే మహా ధర్నా ను విజయవంతం చేయాలని  పిఆర్టియు  తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్  అధ్యక్షుడు పవర్ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఉట్నూర్ మండలంలోని  పాఠశాలలో పర్యటించి    ధర్నాకు ఉపాధ్యాయులను సమాయత్తం చేశారు.

అనంతరం ఉట్నూర్ లోని ప్రెస్ క్లబ్  భవన్లో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. సిఆర్టి లకు  టైం స్కేల్ వర్తింపచేయాలని, వీటిలను అప్డేట్ చేయాలని, పెండింగ్ లో ఉన్న  డీఏలను  ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు సంఘం నాయకులు  దినేష్ చవాన్,  దత్తరాం, నిరూపంలో నాయక్, మిశ్రం రవీందర్, ఆడే జమీందార్, రాథోడ్ శ్రీనివాస్, సీడం భీమ్రావు, తదితర ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.