4 April, 2026 | 3:43 AM

దోమలపల్లి యాదమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు..

30-11-2025 08:32 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దోమలపల్లి యాదమ్మ కృష్ణ మండల సమీకృత కార్యాలయంలో నామినేషన్ పత్రాలను జారీ చేయడం జరిగింది. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలే నాకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించారని మీ సహాయంతో నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని వారన్నారు.