ప్రపంచ కార్మిక దినోత్సవం.. 141వ మేడేని జయప్రదం చేయండి
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ..
సత్తుపల్లి ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ ఆనాటి చికాగో నగర అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం తో పాటు అనేక హక్కులు చట్టాలు రక్షణ కోసం రేపు జరిగే141 మేడే కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు.
సత్తుపల్లి మండలం రామానగరంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి పండగ దినమైన మేడేని ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని ఆనాడు అమరవీరులు సాధించిన అనేక హక్కులు చట్టాలు నేడు మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేందుకు ప్రయత్నం చేస్తుందని 44 కార్మిక చట్టాలను విడగొట్టి నాలుగు లేబర్ కోడులుగా తీసుకొచ్చి దేశంలో కార్మిక వర్గం మెడ మీద కత్తి పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడుతుందని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు కుట్ర సాగిస్తూ మహాత్మా గాంధీ పేరును తీసేసి జి రాంజీ పథకంగా పేరు మార్చి రెండుసార్లు 5 ఫోటో తీయాలని కార్మికులను ఇబ్బంది పెడుతూ ఉపాధి కూలీల పొట్ట కొట్టేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారని దీని ఎదుర్కొనే 200 రోజులు పనులు కల్ పించి 600 రూపాయల కూలీ ఇవ్వాలని పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని మంచి నీరు మెడికల్ కిట్టు టెంట్ ప్రభుత్వం సరఫరా చేయాలని ఉపాధి కూలీలకు సకాలంలో కూలి డబ్బులు చెల్లించాలని ఈ పథకాన్ని కాపాడుకునేందుకు ఉపాధి హామీ కూలీలు మేడే ఉద్యమస్ఫూర్తితో పోరాడాలని దండు పిలుపునిచ్చారు.
అదేవిధంగా దేశంలో వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి తీసుకొచ్చి నల్ల చట్టాలు దేశ రైతాంగాన్ని దేశ వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు అదాని అంబానీలు కట్టబెట్టేందుకు చేసిన కుట్రలను రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి 1300 మంది రైతుల బలిదానాలతో వాటి చట్టాలను వెనక్కి కొట్టిన చరిత్ర ఉందని కార్మికులు కష్టజీవులు పేదలు కూలీలు వ్యవసాయ కూలీలు అందరూ ఐక్యమై ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ రేపు జరిగే మేడే కార్యక్రమంలో చికాగో నగర అమరవీరులకు ప్రతి ఒక్కరు జోహార్లు అర్పించాలని దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హాజరయ్యా జగన్నాథం ప్రభుదాసు సుజాత లక్ష్మి జానకి రమణ రాములమ్మ బూచమ్మ పద్మ అన్నపూర్ణ వీర ఎంకమ్మ వరదానమ్మ తదితరులు పాల్గొన్నారు.






