24 March, 2026 | 2:15 AM

బీసీని సీఎం చేస్తామని చెప్పే దమ్ము బీజేపీకి ఉందా?

24-03-2026 12:21 AM
  1. కాంగ్రెస్ నుంచి భవిష్యత్‌లో బీసీ సీఎం అవుతారు 
  2. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లతో మరోసారి అధికారంలోకొస్తాం 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 
  4. బడ్జెట్‌లో తక్కువ కేటాయింపు లపై విమర్శలకు చెక్ పెట్టాలి  
  5.  పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుంతరావు 
  6. పీసీసీ ఓబీసీసెల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బాధ్యతల స్వీకరణ  

హైదరాబాద్, మార్చి23 (విజయక్రాం తి): బీజేపీ నేతలు బీసీలకు వ్యతిరేకం.. రా ష్ట్రంలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్‌కు చెప్పే దమ్ముం దా..? అని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నిలదీశారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ సీఎం అవుతారని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు దేవుళ్ల పేర్లు చెప్పడం తప్ప.. ఆయనకు బీసీలు గుర్తు రావడం లేదన్నారు.

తెలంగాణ నుంచి దమ్ములేని దద్దమ్మలు బీజేపీ ఎంపీలుగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. బీసీల్లో ఐక్యత లోపం ఉంటే ఏదీ సాధించలేమని, అందుకు బీసీలందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరిం చారు. కాంగ్రెస్ పార్టీలోనే బీసీలకు న్యా యం జరగుతుందన్నారు.

బీసీలకు ఇప్పటీ వరకు 65 శాతం వివిధ చైర్మన్ పదవులు, 60 శాతం ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చామని, 67 శాతం వర కు బీసీలు సర్పంచ్‌లుగా గెలిపించుకున్నామని, కుల సర్వేతో దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందన్నారు.  వీర్లపల్లి శంకర్ నేతృత్వంలోనీ ఓబీసీ మరింత పార్టీ బలోపేతమవతుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మహేష్‌కుమార్‌గౌడ్ జోష్యం చెప్పారు.

ఎవరెంతో వారికంత వా టా రాహుల్ గాంధీ నినాదానికి అనుగుణం గా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాలకు బీసీ ముఖ్యమంత్రులు, గవర్నర్లను చేసిందని తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు తెలంగాణలో ప్రభుత్వం నడుస్తోందన్నారు. పార్టీ పదవులు ఇవ్వడం లో తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. అయితే రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు తక్కువ కేటాయించారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయని వీహెచ్ గుర్తు చే శారు.

ఏపీలో బీసీలకు రూ.50వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన విషయాన్ని వీహెచ్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ రావత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే నవీ న్ యాదవ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎపీ మధుయాష్కి గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ , ఈరవర్తి అనిల్, మె ట్టు సాయికుమార్, నేతలు పాల్గొన్నారు.