ధాన్యం దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): సిద్దిపేట మార్కెట్ లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదనీ, రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ రైతుల పక్షాన అసెంబ్లీ లో కొట్లాడితే ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారని చెప్పారు.
సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, రైతులు ధాన్యం దళారులకు అమ్ముకొని నష్టపోవ ద్దని, కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటె తక్కువ ధరకు ప్రైవేట్ కు అమ్ముకోని రైతులు నష్ట పోవద్దని రైతులు నష్ట పోవద్దని అసెంబ్లీలో రైతుల గురించి కొట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేల చూసామన్నారు. కావున రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




