తరతరాలు గుర్తుంచుకునేలా పనులు చేస్తున్నాం
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్నచింతకుంట ఏప్రిల్ 2: ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పరిపాలన తరతరాలు స్మరించుకునేలా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ 5 లక్షల జీవిత బీమా కవరేజ్ చేస్తూ పేద, మధ్యతరగతి, ధనికుల అంతరాయాలు లేకుండా ప్రతి కుటుంబానికి వర్తింప చేస్తూ కుటుంబ ఆదాయ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.
మండల కేంద్ర పరిధిలో ని ఉంద్యాల గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త , వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ...ఈ గ్రామసభ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక లో భాగంగా దీనిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, సమస్యలు చర్చించడం లాంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి పేద కుటుంబానికి భద్రత ఇవ్వాలని లక్ష్యంతో జూన్ 2వ తేదీన ఇందిరమ్మ కుటుంబ బీమా జీవిత పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.
మండలం కేంద్ర పరిధిలోని బండర్ పల్లి గ్రామంలో కొలువైన శ్రీ.శ్రీ.శ్రీ అలివేలు మంగమ్మ, పద్మావతి సమేత శ్రీ. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అనంతరం గుండ్లుళ శేఖర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మరియు కోట్ల ఎల్లప్ప గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణ పొందాలి
భూత్పూర్, ఏప్రిల్ 2 : విద్యార్థి దశ నుండే మంచి అలవాటులతో క్రమశిక్షణతో ముందుకు సాగి మంచి పేరు సాధిస్తే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటారని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అందిస్తాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారన్నారు. పిల్లలు మొబైల్ కి దూరంగా ఉండి మంచి అలవాట్లని విద్యార్థి దశ నుండి నేర్చుకుంటే క్రమశిక్షణతో తను అనుకున్న లక్ష్యం చేరు అవుతారన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, కౌన్సిలర్లు కేంద్యాల పద్మా నరేందర్, కేంద్యాల శ్రీనివాసులు, లత సూరన్న గారి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లిక్కి విజయ్ గౌడ్, నరేందర్, పవన్, మట్టి ఆనంద్, రాజేష్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.




