14 July, 2026 | 11:23 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

మూసీ పునరుజ్జీవపై ప్రభుత్వానికి ఊరట

03-04-2026 01:55 AM

బీఆర్‌ఎస్ నేత కార్తీక్‌రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఎన్జీటీ

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరమైన కీలక ఊరట లభించింది. ఈ ప్రాజె క్టును సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తిక్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తిరస్క రించింది. దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్టుగా భావిస్తున్నారు.

మూసీ సుందరీకరణతోపాటు గాంధీ సరోవర్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కార్తిక్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాదనలను పరిశీలించిన ట్రిబ్యూనల్, పిటిషనర్ తన ఆరోపణలకు మద్దతుగా సరైన సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు సమర్పించలేదని స్పష్టంచేసింది. కేవలం అనుమా నాల ఆధారంగా ఇలాంటి కీల క ప్రాజెక్టులను నిలిపివేయలేమని పేర్కొం టూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ను అం తర్జాతీయస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరించాలని ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

ఇందుకోసం భారీ వ్యయంతో ప్రణాళికను రూపొందించింది. తాజా తీర్పు తో ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే మూసీ నదిలోకి మురుగునీరు చేర కుండా అడ్డుకునేందుకు ఎస్టీపీల నిర్మాణం, నది పరీవాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్, చెక్ డ్యాముల ఏర్పాటు వంటి పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు.