హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించొద్దు
హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన
కూకట్ పల్లి, జులై 29,( విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథను పదవి నుంచి తొలగించవద్ధని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూకట్పల్లిలో మంగళవారం రంగనాత్ కు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ప్రజలు నిలవాలని పిలుపునిచ్చారు.
పర్యావరణహితమైన హైదరాబాద్ నిర్మాణమే తమ లక్ష్యమని, చెరువుల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు . భూ ఆక్రమణలను సమర్థవంతంగా హారికట్టేందుకు హైడ్రా చేపడుతున్న చర్యలను కొనసాగించాలని, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు.
హైడ్రా ప్రధాన లక్ష్యాలైన ఆక్రమణల తొలగింపు, చెరువుల అభివృద్ధి, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయకూడదని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. చెరువుల పరిరక్షణతోనే నగర భవిష్యత్తు భద్రంగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పర్యావరణ పరిరక్షకుల ఐక్యవేదిక సంస్థ సభ్యులు వర ప్రసాదు, దొర రాజు, ఎం వి రావు తదితరులు పాల్గొన్నారు.






