ప్రాంక్ మెసేజ్ తో పోలీసులకు చిక్కిన బెట్టింగ్ ముఠా
బెట్టింగ్ ముఠాను పట్టించిన ప్రాంక్ మెసేజ్
హైదరాబాద్: తప్పుచేస్తూ పోలీసులకు చిక్కము అనుకునే వాళ్లకు ఇలాంటి ఘటనలు షాకిస్తాయి. ప్రాంక్ మెసేజ్(Prank Message)తో ఓ బెట్టింగ్ ముఠా పోలీసులకు చిక్కింది. సమంత్ అనే యువకుడు మద్యం మత్తులో తనను కిడ్నాప్ చేశారని స్నేహితురాలికి ప్రాంక్ మెసేజ్ చేశాడు. అప్రమత్తమైన యువతి వెంటనే 112కు కాల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేసింది. సెల్ ఫోన్ నంబర్ ట్రేస్ చేసిన పోలీసులు సుమంత్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. సుమంత్ ఉన్న ఫ్లాట్ లో రూ. 30 లక్షలు గుర్తించి ఆరా తీశారు. ఫ్లాట్ లో ఉన్న రూ. 30 లక్షలు బెట్టింగ్ సొమ్ముగా పోలీసులు గుర్తించారు. సుమంత్ ఉన్న ఫ్లాట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఆధారాలు గుర్తించారు. సుమంత్ తో పాటు మనోజ్, గౌతమ్ ను అరెస్టు చేసిన పోలీసులు రూ. 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.






