అక్రమకట్టడాలపై హైడ్రా ఫోకస్: మాదాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారి సస్పెండ్
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు(HYDRA) ఉక్కుపాదం మోపుతున్నారు. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో(Building Collapse) అక్రమ భవనాన్ని నిర్మించినందుకు గాను, బిల్డర్లు ఫరీన్ సిద్ధిక్, మహమ్మద్ సాజిద్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎస్. హబీబున్నీసా సిఫార్సు చేశారు. శనివారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో, ఒక నాలా (కాలువ) పైన 50 చదరపు గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు.
పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ నివాసితో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. బాధితులను మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేష్ ఖరే, మోపత్‌గా గుర్తించారు. వీరు ఆ నిర్మాణ స్థలంలో టైల్స్ వేసే పని చేసేవారు. గాయపడిన వారిలో కూలిపోయిన భవనానికి ఆనుకుని ఉన్న 'జయదర్శిని రెసిడెన్సీ'కి చెందిన 25 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భవన శిథిలాలు తనపై పడినప్పుడు అతను నిద్రలో ఉన్నాడు. గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యజమాని భవన నిర్మాణంలోనూ నాణ్యత పాటించలేదని కేసు నమోదైంది.
బిల్డింగ్ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్ బిల్డింగ్ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బిల్డర్ సాజిద్ అక్రమ నిర్మాణాల(Builder Sajid's illegal constructions) సామ్రాజ్యాన్నే సృష్టించాడు. సాజిద్ నిర్మించినవన్నీ ఇల్లీగల్ బిల్డింగ్‌లని అధికారులు విచారణలో వెల్లడైంది. టౌన్ ప్లానింగ్ అధికారులు(Town planning officials) సాజిద్ అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. చిన్న మెకానిక్‌గా జీవితం మొదలుపెట్టిన సాజిద్ అక్రమ నిర్మాణాలతో భారీగా సంపాదించాడు. సైబరాబాద్ ఏరియాలో సాజిద్ ఖాన్ భారీగా అక్రమ నిర్మాణాలు నిర్మించాడు.
చిన్న స్థలాల్లో అధిక ఫ్లోర్స్ నిర్మించి హాస్టల్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner Ranganath) సాజిద్‌పై ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. అంజయ్య నగర్‌లో కూలడంతో సాజిద్ నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా నిఘా పెట్టింది. సాజిద్‌కు సహకరిస్తున్న అధికారులపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించింది. కాలువలు, నాలాలపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తామని హైడ్రా స్పష్టం చేసింది. చిన్నపాటి వర్షానికికే నగరంలో కాలువలు, మోరీలు పొంగి రోడ్లపైకి మురుగు నీరు చేరుతుంది. దీంతో నాలాలు కబ్జా చేసి నిర్మిణాలు చేపట్టిన వారిపట్ల హైడ్రా కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
మాదాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారి సస్పెండ్
భవనం కూలిన ఘటనలో మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న అంజయ్యనగర్ లో భవనం కూలిన ఘటనలో బాధ్యులపై అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుని టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పై వేటు పడింది. టీపీవో సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సీఎంసీ ఉత్తర్వులు జారీ చేశారు.






