18 May, 2026 | 4:14 PM

రైతులకు ఇబ్బంది కలిగించవద్దు

18-05-2026 02:59 PM

నిర్మల్ మే 18 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో యాసంగిలో రైతులు పండించిన మొక్కజొన్న ,  వ ధాన్యం ధాన్యం కొనుగోలలో రైతులకు ఇబ్బంది కలిగించవద్దని సిపిఐ పార్టీ డివిజన్ నాయకులు ఎస్ ఎన్ రెడ్డి తెలిపారు. రైతుల పంట చేతికొచ్చిన కొనుగోళ్లలో    జాప్యం జరగడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సంచుల కొరతను పరిష్కరించాలని కూలీలను లారీల కొరతను సమస్య పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ భూమన్న రమేష్ తదితరులు ఉన్నారు.