దైవ అనుగ్రహం అందరిపై ఉండాలి
డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్‌నగర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): దైవ అనుగ్రహం అందరిపై ఉన్నప్పుడే అభివృద్ధి మరింత వేగంగా అడుగులు వేస్తుందని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలో పలు డివిజన్లో జరిగిన బోనాల వేడుకలలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరై అమ్మవార్లకు ప్రత్యేక దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని, అమ్మవార్ల దయా దక్షిణాల వల్ల వర్షాలు బాగా కురిసి ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలని తాము వేడుకున్నట్లు పేర్కొన్నారు. 8,22 డివిజన్లో హైమస్ట్ విద్యుత్ దీపాలతో పాటు నూతనంగా ఇటీవల వేసిన బోరును డిప్యూటీ మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అధికారులు కాలనీవాసులు ఉన్నారు.






