5 August, 2026 | 4:41 AM

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

05-08-2026 01:37 AM

గణపురం ఆగస్టు 4 (విజయ క్రాంతి) : మండల కేంద్రంలోని 5వ  అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్ ఆలూరి కోమల తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బాబుకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు.  తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం తో పాటు టీకాలు వేయించాలి బిడ్డకు,

మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించడం వల్ల శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లిపాలు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరమని, ప్రతి తల్లి ఈ విషయాన్ని గుర్తుంచుకుని చిన్నారులకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. లబ్ధిదారులకు పౌష్టిక ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఆయా సరోజన పిల్లలు తల్లులు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.