5 June, 2026 | 9:18 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

05-06-2026 08:24 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని రేంజ్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. రేంజ్ పరిధిలో పర్యవేక్షణ లో భాగంగా కృష్ణ పల్లి సెక్షన్ లో రాముడు, భీముడు టేకు చెట్లను పరిశీలించారు. బేస్ క్యాంపును సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డి ఓ అప్పయ్య, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి షాపీయా బేగం, సంతోష్, మనోహర్ సిబ్బంది పాల్గొన్నారు.