5 June, 2026 | 10:18 PM

టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి

05-06-2026 08:41 PM

లేకుంటే కామారెడ్డి  నుంచి వెయ్యి మందితో గాంధీ భవన్​లో దీక్ష చేపడతాం

కామారెడ్డి కాంగ్రెస్ నాయకుల డిమాండ్

అవసరం అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం

కామారెడ్డి,(విజయక్రాంతి): టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నీ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్లు మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ ఓటమికి చంద్రశేఖర్ రెడ్డి కారణమని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే కామారెడ్డి నుండి 1000 మందితో గాంధీభవన్లో దీక్ష చేపడతామన్నారు.

అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అన్నారు. నలుపై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న తమకు నిన్న గాక మొన్న వచ్చి కాంగ్రెస్ ను విచ్చిన్నం చేసేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవుల్లో కొనసాగిన వారు డబ్బులకు అమ్ముడుపోయారన్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతూ టిఆర్ఎస్ కోర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ నాలుగు కోట్లకు షబ్బీర్ అలీ అమ్ముకున్నట్లు తప్పుడు ఆరోపణ చేయడం తగదన్నారు. ఏ ఒక్కటి రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని షబ్బీర్ అలీ వర్గా కాంగ్రెస్ నాయకులన్నారు.

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నీ కతం చేయడం కోసం  గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్కు కోవార్డుగా పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బస్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్ముల తిరుమల్ రెడ్డి ని కొట్టినందుకు చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారని వారు గుర్తు చేశారు. నిజాయితీ కలిగిన శిబిరెల్లిపై నిరాధార ఆరోపణలను చేస్తున్నారని, ఆరోపనలను నీగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న వారు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి పై తాము చేసిన ఆరోపణలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తగ్గడానికి చంద్రశేఖర్ రెడ్డి వర్గమే కారణమని ఆరోపించారు. ఆయనపై ఉన్న వ్యతిరేకైతే మెజార్టీ తగ్గడానికి కారణం అన్నారు.

వారం రోజుల్లో చంద్రశేఖర్ ఎన్ని సస్పెండ్ చేయకపోతే సీఎం, పిసిసి చీప్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లను 1000 మందితో వెళ్లి కలుస్తామన్నారు. అప్పటికి సస్పెండ్ చేయకపోతే తామే రాజీనామాలు చేస్తామని వారన్నారు. కోవట్లను లీడలు చేస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. 40 ఏళ్లుగా పార్టీలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా పనిచేస్తున్న వాళ్లు పార్టీకి కావాలా లేక మూడేళ్ల క్రితం వచ్చి పార్టీని బ్రష్టు పట్టించే వాళ్ళు కావాలా పార్టీ అధిష్టానం పెంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సందీప్ కుమార్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా గౌడ్, నౌశిలాల్, గోనె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.