7 July, 2026 | 9:42 PM

ప్రతిభావంతులుగా గుర్తించి ప్రోత్సహించాలి

07-07-2026 08:30 PM

– ఆర్మూర్‌ భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్‌

ఆర్మూర్‌,(విజయక్రాంతి): వైకల్యంతో బాధపడుతున్న వారిని చూసి జాలి పడకుండా విశిష్ట ప్రతిభావంతులుగా గుర్తించి వారిని ప్రోత్సహించాలని సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ పడకంటి శ్రీనివాస్‌రావు సూచించారు. ఆర్మూర్‌ పట్టణంలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని జిల్లా ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ రెడ్డితో కలిసి మంగళవారం  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. దివ్యాంగ విద్యార్థులకు టీఎల్‌ఎం సహకారంతో విద్యా బుద్దులు నేర్పించడాన్ని పరిశీలించారు.

కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థులు ప్రొఫైల్స్, ఐఈపీలు తదితరత రికార్డులను పరిశీలించి ఐఈఆర్పీలు కిషన్, సురేష్‌తో మాట్లాడారు. డెయిలీ లివింగ్‌ స్కిల్స్‌తో పాటు సబ్జెక్టులను సైతం వారికి బోధించాలని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు పింఛన్లు ఇప్పించే ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ ప్రారంభించినందున అవసరం ఉన్న వారి వివరాలు సేకరించి జిల్లా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.  కేంద్రంలో వారానికి రెండు సారు ఉచితంగా అందిస్తున్న ఫిజియోథెరపీ సేవలను పరిశీలించి డాక్టర్‌ అరుణతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేసారు. వారి వెంట ఆర్మూర్‌ మండల విద్యాధికారి రాజ గంగారాం ఉన్నారు.