13 August, 2026 | 3:43 AM

ఇంగ్ల్లీష్ పాఠాలు బోధించిన జిల్లా కలెక్టర్

13-08-2026 12:00 AM

బోధన్ ఆగస్టు 12 (విజయ క్రాంతి): ఎడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల విద్యాలయాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. పదో తరగతి క్లాస్ రూమ్లను సందర్శించారు. విద్యార్థినులకు ఇంగ్లీష్ పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన బహుమతులను విద్యార్థులకు అందజేశారు. బాగా చదువుకోవాలని సూచించారు.